నీహారిక పెళ్లిలో మెగా సందడి..ఘనంగా ప్రీ వెడ్డింగ్‌ వేడుక

-

అల్లు అండ్‌ మెగా ఫ్యామిలీస్‌ ఒకచోటకు చేరి చేస్తున్న సందడి అంతాఇంతా కాదు. మెగా వారసురాలు నీహారిక, చైతన్యల ప్రీ వెడ్డింగ్‌ వేడుక ఘనంగా జరుగుతోంది. సోమవారం జరిగిన సంగీత్‌లో.. మంగళవారంనాటి మెహందీలో విజిల్స్‌.. డ్యాన్స్‌ .. కేరింతలతో మెగా సందడి నెలకుంది. బుధవారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు నిహారిక మెడలో చైతన్య మూడుముళ్లు వేయనున్నాడు.

నీహారిక పెళ్లికి రాజస్థాన్‌లోని ఉదయ్‌ విలాస్‌ వేదిక అయింది. పెళ్లికి రెండు రోజుల ముందే కొణిదల, అల్లు ఫ్యామిలీలు ప్రత్యేక విమానాల్లో అక్కడికి చేరుకున్నారు. ఈ రెండు ఫ్యామిలీస్‌ తప్ప సినిమావాళ్లు కనిపించకపోయినా.. నీహారిక ఫ్రెండ్స్‌ రీతు వర్మ.. లావణ్య త్రిపాఠి పెళ్లికి హాజరయ్యారు. వివాహానికి ముందు జరిగే సంగీత్‌లో కాబోయే దంపతులు బాయ్స్‌ సినిమాలోని అలే అలే పాటకు హుషారుగా వేసిన డ్యాన్స్‌ ఆకట్టుకుంది. దీనికి ముందు తీన్‌మార్‌ మ్యూజిక్‌కు స్టెప్పులేసిన వీడియో నెట్‌లో వైరల్‌ అవుతోంది.

మామయ్య నాగబాబుతో కలిసి అల్లు అర్జున్‌ విజిల్స్‌ వేసి హంగామా చేశాడు. చెల్లి నీహారికతో రామ్‌చరన్‌ కలిసి దిగిన ఫొటోలు ఆకట్టుకున్నాయి. ఇక అన్నయ్య వరున్‌తేజ్‌ చిట్టి చెల్లిని భుజాలపై మోశాడు. ఈ మెగా వేడుకలో పవన్‌ లేని లోటు కూడా తీరింది. పవన్‌కల్యాన్ తనకున్న పొలిటికల్‌ కమిట్‌మెంట్‌తో చిరంజీవితో కలిసి వెళ్లలేకపోయాడు. ఈరోజు ఉదయ్‌పూర్‌ చేరుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version