మార్గశిరమాసం- డిసెంబర్- 24- గురువారం.
మేషరాశి:వివాదాలకు దూరంగా ఉండండి !
ఈ రోజు మీ పై అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహ పూర్వకంగా మెలగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. వైవాహికంగా బాగుంటుంది. అనుకోని ప్రయాణాలకు అవకాశం.
పరిహారాలుః శివారాధన మేలు చేస్తుంది.
వృషభరాశి
మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ, దేవాలయ సందర్శన కానీ చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి. నిద్రలేమి కారణంగా అసౌకర్యంగా ఉంటుంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.
పరిహారాలుః శ్రీగురుచరిత్ర వినడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది.
మిథునరాశి:మంచి గుర్తింపు వస్తుంది
ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. మీకు ఆర్థికంగా బాగుంటుంది. ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
పరిహారాలుః శ్రీగురుదత్తాత్రేయారాధన మంచి చేస్తుంది.
కర్కాటకరాశి :ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త !
ఈరోజు జాగ్రత్తలతో మీకు లాభాలు కలుగుతాయి. ఈ రోజు డబ్బు విషయంలో సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.
పరిహారాలుః శ్రీసాయిబాబా దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
సింహరాశి:ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త !
ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. గ్రహచలనాల రీత్యా మీకు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. వైవాహికంగా బాగుంటుంది.
పరిహారాలుః శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
కన్యరాశి:ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది !
ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు ఆర్థికంగా చాలా అనుకూలంచే దినం. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
పరిహారాలుః శ్రీలక్ష్మీదేవి దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేయండి.
తులరాశి:ఈరోజు విజయం మీ సొంతం !
ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.
పరిహారాలుః శ్రీకాలభైరావష్టకం పారాయణం చేయండి.
వృశ్చికరాశి:ఈరోజు శుభవార్త వింటారు !
ఈరోజు అనుకూ ఫలితాలు వస్తాయి. మీకు దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది. వైవాహికంగా పర్వాలేదు.
పరిహారాలుః శ్రీరామ నామాన్ని కనీసం 108 సార్లు జపించండి.
ధనుస్సురాశి:ఆర్థిక విషయాలలో జాగ్రత్త !
ఈరోజు కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీ ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధ మైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.
పరిహారాలుః శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మకరరాశి:ఈరోజు ఆనందంగా ఉంటుంది !
ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. అనుకోని మిత్రులను కలవటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
పరిహారాలుః నవగ్రహస్తోత్రాలను పారాయణం చేయండి.
కుంభరాశి:వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది !
ఈరోజు మీకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలోవిదేశీ యానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వైవాహికంగా బాగుంటుంది.
పరిహారాలుః శ్రీకృష్ణాష్టకం పారాయణం మంచి ఫలితం ఇస్తుంది.
మీనరాశి:ఈరోజు మిశ్రమంగా ఉంటుంది !
ఈరోజు గ్రహచలనాల రీత్యా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆర్థిక విషయాలలో ఇతరుల జోక్యం చేసుకోకుండా జాగ్రత్త తీసుకోండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకోని అతిథులు మీ ఇంటికి వస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. పిల్లల విషయంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. అప్పులు ఎవరికి ఇవ్వకండి. వైవాహికంగా బాగుంటుంది.
పరిహారాలుః శ్రీదత్త వజ్రకవచం పారాయణం మంచి ఫలితాన్నిస్తుంది.
- శ్రీ