ఎన్నడూ లేనంతగా తగ్గనున్న పెట్రోలు,డీజిల్ ధరలు. గ్లోబల్ మార్కెట్లలో భారీగా పడిపోయిన క్రూడ్ ధరలు.ఈ మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భారీగా పతనం అయ్యాయి.
ఒకానొక సమయం లో ఏకంగా 30 శాతానికి పడిపోయాయి. 1991 నుండి చూసుకుంటే ఈ స్థాయిలో ముడి చమురు ధరలు తగ్గడం ఇదే మొదటి సారి. కరోనా ఎఫెక్ట్ అన్ని మార్కెట్ల తో పాటు ముడి చమురు మీద కూడా పడింది. ఇదే కాకుండా రష్యా, సౌదీ అరేబియా ల మధ్య జరుగుతున్న ధరల యుద్దం ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
ఇరు దేశాల మధ్య క్రూడ్ ఉత్పత్తి గురించి ఒక సమావేశం జరిగింది. కానీ ఈ సమావేశం లో చర్చలు విఫలమయ్యాయి. డిమాండ్ పడిపోవడం తో ధర పై తీవ్ర ఒత్తిడి కారణం గా, ఈ చర్చలు విఫలం కావడం వల్ల క్రూడ్ రేట్లు మరింత క్షీణించింది. ఇక్కడ ప్రాధాన్యత తగ్గినప్పటికీ క్రూడ్ ఉత్పత్తి మాత్రం తగ్గక పోవడం గమనార్హం.