దీపావళి.. దీపాల వరుస. ఈ పండుగకు ప్రధాన కారణం నరకాసురవధ. నరక సంహారం తర్వాత సత్యభామ, కృష్ణులకు నాడు ప్రజలందరూ దీపాలతో స్వాగతం పలుకుతారు. ఈ పండుగలో ప్రధాన దేవతలు విష్ణు, లక్ష్మీదేవి. వీరికి ప్రీతికరమైన తులసీకి పూజ, అక్కడ దీపారాధన అత్యంత శ్రేష్ఠం. దీపాల పండుగ దీపావళి రోజున దివ్వెలతో ఇంటిని అలంకరించుకోవడం ఆనవాయితీ. పవిత్రమైన తులసీకోట ముందు, చుట్టూ దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలతో సుఖంగా వుంటారు.
దీపావళి రోజున మాత్రమే కాకుండా తులసీ కోట ముందు ఉదయం, సాయంత్రం సమయాల్లో భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో తులసీ చెట్టు వుంటే.. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వుండవు. తులసీ ఆకుల రసాన్ని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు వుండవు. తులసీ ఆకుల రసం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటికి వెళ్లినప్పుడు పూజించే తులసీమొక్క కాకుండా పక్కన ఉండే తులసీచెట్టువి రెండు దళాలు తుంచి నోట్లో వేసుకుంటే పని తప్పక విజయం అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
– కేశవ