రోజూ 10 వేల అడుగులు వేస్తే మీ లైఫ్ మారిపోతుంది…!

-

కూర్చున్న చోటు నుండి కదలకుండా బాడీ ని పెంచేస్తున్నారు. తర్వాత తగ్గించడానికి నానా అగచాట్లు పడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ అదే తీరు. ఈ కారణంగా చిన్న వయసులోనే ఊబకాయం, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే నిపుణులు రోజుకు ఒక గంట నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది అని సూచిస్తున్నారు.

రోజు ఒక గంట నడవడం శరీరాన్ని ఎంత ఆరోగ్యం గా ఉంచుతుంది. మీ దృష్టి వాకింగ్ వైపు మళ్ళితే మాత్రం మీరు బరువు తగ్గడానికి సరైన ఆలోచన చేస్తున్నారని అర్ధం. రోజువారీ పనులను సులువుగా చేసుకోవడానికి మీకు 10,000 అడుగులు నడవడం అనేది చాలా అవసరం. ఒక రోజు మొత్తం అటు ఇటు పని చేసుకుంటూ చాలా నడక నడుస్తాం కదా అనుకోవచ్చు.

కానీ అది నడక వ్యాయామము లెక్కలోకి రాదు. నేల మీద కూర్చున్నప్పుడు లేవడానికి, లేచి కూర్చోవడానికి, వెన్నునొప్పి వంటి ఇబ్బందులు ఎదుర్కొంటే, మీ జీవనశైలిలో చాలా వ్యాయామానికి సమయం కేటాయించాలి. రోజంతా చురుకుగా ఉండాలి అంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యం బలంగా ఉండాలి. వ్యాయామం చేయడానికి జిమ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, రోజూ ఒక గంట 10,000 అడుగులు నడవండి అని వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు.

వాకింగ్ బయట చేయడం కుదరని పక్షంలో ఇంట్లో స్కిప్పింగ్ చేయడం కూడా చాలా మంచిది. లేదంటే ఈ మధ్య కాలంలో అందరికీ అందుబాటులో ట్రెడ్ మిల్ వచ్చాయి. వాటి మీద ఒక గంట నడవడం వల్ల కూడా శరీరానికి మంచి వ్యాయామం అందుతుంది. చిన్న చిన్న పనులు చేసుకోడానికి కూడా నడిచి వెళ్ళడం మానేస్తున్నారు. అలా కాకుండా కూరగాయలు, కిరాణా షాపుకి వెళ్లాల్సి వచ్చినప్పుడు దగ్గర్లోని వాటికి నడిచి వెళ్ళడం ద్వారా కూడా శరీరానిక శారీరక శ్రమ అందుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version