కరీంనగర్ లోని దీపిక హాస్పిటల్ కు చికిత్స కోసం వచ్చిన మహిళపై లైంగికంగా దాడి చేశారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్ కు వచ్చింది. దీంతో వైద్యులు పరీక్షలు చేసి అడ్మిట్ చేశారు. కాగా టెక్నీషియన్ దక్షిణామూర్తి మహిళకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డారు. మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఎమర్జెన్సీ గదిని సీజ్ చేశారు. వెంటనే సిసి ఫుటేజ్ ను పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ విషయం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, యువతి కుటుంబ సభ్యులు హాస్పిటల్ యాజమాన్యంపై ఫైర్ అవుతున్నారు. తమ కూతురికి న్యాయం జరగాలని లేకపోతే ఊరుకునేది లేదంటూ సీరియస్ అవుతున్నారు. జ్వరంతో వచ్చిన మహిళపై ఇలా లైంగిక దాడి చేయడం సరి కాదని అంటున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.