ఇప్పుడు మనం షాపింగ్ మాల్స్ లో కొనే వస్తువుల కంటే అద్భుతమైనవి, అత్యంత విలువైనవి ఒకప్పుడు మన భారతదేశంలో హంపి బజార్లలో లభించేవి. విజయనగర సామ్రాజ్యం ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన రాజ్యాలలో ఒకటి. దాని రాజధాని హంపి నాటి వాణిజ్యానికి కళలకు కేంద్రంగా ఉండేది. ఆ కాలంలో హంపిలో ఉన్న బజార్ లలో ఎంత గొప్పవంటే అక్కడ బంగారం, వజ్రాలు బస్తాల్లో పోసి అమ్మేవారిట. ఈ మాట వింటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. అది కేవలం ఒక కథ కాదు చరిత్రలో నమోదైన వాస్తవం..
ప్రపంచ వాణిజ్యానికి కేంద్రం : విజయనగర సామ్రాజ్యంలోని హంపి కేవలం ఒక రాజ్యం నికి రాజధాని మాత్రమే కాదు అది అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా కూడా ఉండేది. పోర్చుగీసు పరిషియన్ చైనా దేశాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసేవారు. ఇక్కడ నుంచి అరేబియా గుర్రాలు, సిల్క్ సుగంధద్రవ్యాలు, రత్నాలు వంటి ఎన్నో వస్తువులు ఎగుమతి దిగుమతి అయ్యేవి.
బంగారు వజ్రాల బజార్లు: ప్రపంచ చరిత్రకారుడు, యాత్రికుడు అబ్దుల్ రజాక్ తన రచనలలో హంపి బజార్ల గురించి అద్భుతంగా వివరించాడు అక్కడ ఉన్న హీరా మందిర్ వజ్రాల దేవాలయం అనే ప్రాంతంలో వజ్రాలు, ముత్యాలు బస్తాల్లో పోసి విక్రయించే వారట. అంతేకాదు బంగారం కూడా కిలోల లెక్కన కాకుండా బస్తాల్లో కొలిచి అమ్మేవారిట ఈ బజార్లు రాత్రి, పగలు రద్దీగా ఉండేవి అనే చరిత్ర చెబుతోంది.

అద్భుతమైన నిర్మాణ శైలి : హంపిలో ఉన్న బజార్లు కేవలం అమ్ముకునే ప్రదేశాలు మాత్రమే కాదు అవి అద్భుతమైన నిర్మాణ సైనితో ఉండేవి. వీటికి ఇరువైపులా దుకాణాలు వాటి ముందు కప్పబడి నడిచే మార్గాలు ఉండేవి. అప్పటి నిర్మాణశైలి వాస్తు కళ చాలా ఉన్నత స్థాయిలో ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న హంపి శిధిలాలు ఆనాటి వైభవానికి సాక్షాలుగా నిలిచి ఉన్నాయి.
ప్రజల జీవన విధానం: విజయనగర సామ్రాజ్యంలో ప్రజలు చాలా సంపన్నంగా, సుఖంగా జీవించేవారు. వారికి అవసరమైన ప్రతి వస్తువు సులభంగా లభించేది. అందుకే ఆ బజార్లలో ప్రతినిత్యం రద్దీగా ఉండేవారు. అప్పటి రాజులు వ్యాపారులు ప్రజల సౌభాగ్యం కోసం ఈ బజారును ఎంతో శ్రద్ధగా నిర్వహించేవారు.