ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త. స్టీల్, సిమెంట్ పై జిఎస్టి 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతోంది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కొంతమేర భారం తగ్గుతుంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 180 సంచుల సిమెంట్ అవసరం పడుతుంది. కాగా సంచి ధర రూ. 330 నుంచి 370 రూపాయలుగా ఉంది. ఇక నుంచి జిఎస్టి తగ్గడం ద్వారా సిమెంట్ సంచిపై 30 రూపాయల చొప్పున రూ. 5500 ఆదా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు 1500 కిలోల స్టీల్ ఇంటికి అవసరం పడుతుంది. కేజీ రూ. 70 నుంచి 85 రూపాయల వరకు పలుకుతోంది. స్టీల్ పై కేజీకి రూ. 5 రూపాయలు తగ్గిన రూ. 7,500 ఆదా కానుంది. మొత్తం రూ 13 వేల వరకు తగ్గనుంది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కొంత మేరకు భారం తగ్గుతుంది. ఈ విషయం తెలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లకు లబ్ది పొందిన మహిళలకు ఇంటిని అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.