బ్రేకప్‌పై రియాక్ట్ అయిన దీప్తి సునయిన.. లైవ్‌లో కన్నీళ్లు

-

రెండు రోజుల క్రితం దీప్తి సునయన, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్…ఇద్దరు తమ లవ్ కు బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. తమ అభిప్రాయాలు వేరని… ఇక నుంచి ఎవరి దారులు వాళ్ళు చూసుకుని… కెరీర్ పై దృష్టి పెట్టాలని ఉద్దేశంతో విడిపోతున్నట్లు దీప్తి సునయన పోస్టు పెట్టింది. అయితే ఈ బ్రేక్అప్ పై మరోసారి దీప్తి సునయన స్పందించింది.

బ్రేక్ అప్ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా… “జీవితంలో ఎప్పటికీ ఇలాగే ఉండాలని లేదు కెరీర్ పరంగా ఏదైనా సాధించాలి అనుకున్న ఇప్పటివరకు నా గురించి నేను ఆలోచించుకోలేదు నాకు అస్సలు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నన్ను నేను అనుకుంటున్నా అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది దీప్తి సునయన. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని అటు నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version