IPL 2024: చరిత్ర సృష్టించిన ఢిల్లీ క్యాపిటల్స్

-

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్ర సృష్టించింది. గుజరాత్ తో మ్యాచ్ లో 67 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఢిల్లీకి ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు 2022లో పంజాబ్ కింగ్స్ 57 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. అలాగే ఈ సీజన్ లో బంతుల పరంగా అతిపెద్ద విజయంగా ఢిల్లీ రికార్డు నమోదు చేసింది.

Delhi Capitals make history

కాగా, బలమైన గుజరాత్ జట్టును ఏకంగా 6 వికెట్ల తేడాతో ఓడించగలిగింది ఢిల్లీ కాపిటల్స్. నిన్న గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాతి జట్టు 89 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఢిల్లీ బౌలర్స్ లో దాటికి గుజరాత్ బ్యాటర్లు నిలువ లేకపోయారు. ఇక అనంతరం చేజింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 8.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేదించగలిగింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news