దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. కరోనా కేసులను కట్టడి చేయడానికి చాలా వరకు అక్కడి ప్రభుత్వం కష్టపడుతుంది. ఇప్పుడు ఢిల్లీ లో మూడో దశలో ఉందని, ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని సిఎం అరవింద్ కేజ్రివాల్, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్ర నాథ్ జైన్ హెచ్చరికలు చేసారు. ప్రజలు సహకరిస్తే కరోనా అదుపులోకి వస్తుంది అన్నారు.
అయినా సరే ఢిల్లీ ప్రజల తీరులో మార్పు రాలేదు. భారీగా జనాలు గుమిగూడుతున్నారు. సదర్ బజార్ లోని లాహోరి గేట్ చౌక్ వద్ద భారీగా జనం కనపడటంతో ప్రభుత్వం కంగారు పడింది. వీరిలో చాలా మందికి మాస్క్ లు కూడా లేవు. ఢిల్లీలో ఐసియు బెడ్స్ కూడా కాళీగా లేవు అని తెలుస్తుంది.