ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం…. మాస్క్ ధరించకపోతే రూ.500 ఫైన్..!

-

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులు తగ్గుముఖం పడుతున్నకరోనా కేసులు… గత రెండు మూడు రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ ఒక్క రోజే 2 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. హర్యానా, ఢిల్లీల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కేంద్రం అలెర్ట్ అయింది. హర్యానా, ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలకు లేక రాసింది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. వ్యాక్సినేషన్ వేగవంత చేయాలని సూచించింది.

ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలోని పలు స్కూళ్లలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా మాస్క్ ధరించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ( డీడీఎంఏ) ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మాస్క్ ధరించకపోతే రూ. 500 వరకు ఫైన్ వేసే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version