మ‌ర్క‌జ్ కేసులోని మ‌రో 76 మందికి బెయిల్‌..!

-

దేశంలో కరోనా మ‌హ‌మ్మారి వేగంగా ప్రబలడానికి మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌లో జ‌రిగిన ప్రార్ధ‌న‌లు ‌కారణమైన విషయం తెలిసిందే. ఈ విషయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ప్రార్ధ‌న‌ల‌కు బాధ్యులైన వారిని అరెస్టు చేశారు. అయితే రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిలో కొంద‌రు మంగ‌ళ‌, బుధ‌వారాల్లో బెయిల్‌పై విడుద‌ల‌వగా, తాజాగా మ‌రో 76 మందికి ఒక్కొక్కరికి 10 వేల పూచీకత్తుతో ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  తరువాత వీరు తమ అభ్యర్థనలను తెలియచేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు న్యాయవాది అషిమా మండ్లా వివరించారు.

కొందరు విదేశీ జాతీయుల తరఫున ఈ న్యాయవాది వాదించారు. తాము తెలిసో తెలియకో నేరం చేసినట్లు వీరు అంగీకరించినందున తక్కువ శిక్షలతో సరిపెట్టాలని కోరుతున్నట్లు న్యాయవాది తెలిపారు. మాలీ, నైజీరియా, శ్రీలంక , కెన్యా , టాంజానియా, దక్షణాఫ్రికా, మయన్మార్‌లకు చెందిన వారు మర్కజ్‌కు హాజరయ్యారు. ఇటువంటి కేసులలో సాధారణంగాఏడేళ్లు జైలు శిక్ష ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విదేశీ జాతీయులను కోర్టు ముందు హాజరుపర్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version