కేసీఆర్ కు షాక్…. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత పేరు?

-

ఢిల్లీ ప్రభుత్వంలో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణంలో విస్తు పోయే విషయాలు బయటకి వస్తున్నాయి. ఈ స్కామ్ కు సంబంధించిన పక్క ఆధారాలు సేకరిస్తుంది సిబిఐఐ. ఈ కేసులో 14 మందితో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది సిబిఐ. ఏ1 గా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను చేర్చింది. ఇది ఇలా ఉండగా.. ఈ లిక్కర్‌ కేసు.. తెలంగాణ రాజకీయాల్లో కల్లోలం రేపుతోంది.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ డిసైడ్‌ చేసింది తెలంగాణ సీఎం అనుచరులేనని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్‌ సింగ్‌ శర్మ ఆరోపణలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మనీశ్ సిసోడియాకు 150 కోట్లు లంచం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

పంజాబ్‌, బెంగాల్‌ లో తీసుకొచ్చిన పాలసీ వెనుక కూడా ఈ శక్తుల హస్తం ఉందని ఎంపీ పర్వేజ్‌ సింగ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ ఫ్లైట్‌ లో వచ్చి ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటర్‌ లో మంతనాలు జరిపారని బీజేపీ ఎంపీ తెలిపారు. తెలంగాణ నుంచే వచ్చిన వారే ఆ రూ.150 కోట్లు ఇచ్చారని ఆరోపణలు చేశారు. ఈ కేసులో కల్వకుంట్ల కవిత హస్తం ఉందంటూ ఎంపీ పర్వేజ్‌ సింగ్‌.. చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version