రిజర్వేషన్ల విషయం లో బీజేపీ మీద కాంగ్రెస్ నాయకులు ఫేక్ వీడియో క్రియేట్ చేసారని వార్తలు వస్తున్నా విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ మీద కాంగ్రెస్ నాయకులు ఫేక్ వీడియో క్రియేట్ చేసారని ఢిల్లీ లో బీజేపీ నేతలు కంప్లైంట్ చేసారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ పేరు మీద నోటీసులు వచ్చాయి.
అయితే కాంగ్రెస్ సోయల్ మీడియా ఇంచార్జ్ మన్నే సతీష్ కి నోటీసులు ఇవ్వడానికి గాంధీ భవన్ కి ఢిల్లీ పోలీసులు వచ్చారు. 91 crpc కింద నోటీసులు ఇవ్వడానికి గాంధీ భవన్ కి ఢిల్లీ పోలీసులు రావడం జరిగింది. ఇదే కేసులో కాసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న ఆ విచారణకి హాజరు అవ్వాలని ఢిల్లీ పోలీసులు చెప్పారు ఐటీ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ ని నమోదు చేశారు.