సీఏ పరీక్ష తేదీని మార్చాలన్న పిటిషన్ ని రిజెక్ట్ చేసిన కోర్టు..!

-

లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మే లో జరగాల్సిన చార్టెడ్ అకౌంటెన్సీ పరీక్షలకి సంబంధించి కొన్ని పేపర్లను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్ ని సోమవారం నాడు సుప్రీంకోర్టు తిరస్కరించింది. పోలింగ్ రోజు ఎలాంటి పరీక్షని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెన్సీ నిర్వహించట్లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయమూర్తులు జె బి పార్దివాల మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.

లోక్సభ కి సార్వత్రిక ఎన్నికలు మే 7 ,13 తేదీల్లో జరుగుతున్నాయని మే 6 , మే 12 తేదీల్లో ఎలాంటి పరీక్ష ని షెడ్యూల్ చేయలేదని పేర్కొంది పరీక్షల తేదీలని మార్చడం వలన వాటి నిర్వహణ కోసం ఇప్పటికే జరిగినా విస్తృత ఏర్పాటుకి విగాథం ఏర్పడుతుందని అందుకు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ధర్మాసనం చెప్పింది పరీక్షల షెడ్యూల్ విధానాల మీద నిర్ణయాలకు సంబంధించినది కాబట్టి పిల్ ని తిరస్కరించినట్లు ధర్మాసనం వెల్లడించింది

Read more RELATED
Recommended to you

Exit mobile version