ఢిల్లీలో కరోనా టెర్రర్‌..1700 మంది పోలీసులకు పాజిటివ్‌

-

దేశ రాజధాని అయిన ఢిల్లీ లో కరోనా థర్డ్‌ వేవ్‌ విలయ తాండవం సృష్టిస్తోంది. ఢిల్లీ ప్రతి రోజు 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో..నైట్‌ కర్ఫ్యూ లాంటి కరోనా ఆంక్షలను ఢిల్లీ సర్కార్‌ అమలు చేస్తుంది. అయినప్పటికీ.. రాజధాని ఢిల్లీ కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా 1700 మంది పోలీసు సిబ్బంది కరోనా సోకింది.

ఇందులో హోం గార్డుల నుంచి… ఎస్‌ఐలు, సీఐ లు, ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జనవరి 12 తేదీల మధ్యలోనే 1700 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్‌ శాఖ కాసేపటి క్రితమే ప్రకటించింది. కాగా.. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లోనే… 21,259 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అలాగే నిన్న ఒక్క రో జే 23 మంది కరోనా కారణంగా మరణించారు. జూన్ 16 నుండి అత్యధిక మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version