జాతీయ రాజధాని ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కాలుష్య స్థాయి కొంత తగ్గింది. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో చలి పులి చంపేస్తోంది.ఢిల్లీలో ఉష్ణోగ్రత రోజు రోజుకు పడిపోతోంది. నేడు, రాజధాని కనీస ఉష్ణోగ్రత గత 17 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. ఢిల్లీలో ఈసారి, నవంబర్ ప్రారంభం నుండి, ప్రజలు భోగి మంటల మద్దతు తీసుకోవలసి వచ్చింది.
ఈ ఉదయం 6.9 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చివరిసారిగా 2003, నవంబర్‌లో అత్యల్పంగా 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మరో పక్క కరోనా కేసులు ఢిల్లీని టెన్షన్ పెడుతుంన్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతే.. కోవిడ్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందనే నిపుణుల హెచ్చరికలు అక్కడి ప్రభుత్వాన్ని గట్టిగా టెన్షన్ పెడుతున్నాయి. కరోనా కట్టడికి ఓవైపు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి.