పార్సిల్ ఇవ్వడానికి వెళ్లి యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పూణె – షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో బుధవారం రాత్రి 7:30 గంటలకు పార్సిల్ ఇవ్వడానికి వెళ్లి యువతి(22)పై అత్యాచారం చేసాడు డెలివరీ బాయ్. పార్సిల్ ఇచ్చి ఓటీపీ చెప్పమని అడగగా మొబైల్ తెచ్చుకునేందుకు ఇంట్లోకి వెళ్ళింది యువతి.
అదే అదునుగా చూసి ఇంట్లోకి వెళ్లి డోర్ వేసి యువతి మొహంపై పెప్పర్ స్ప్రే కొట్టాడు డెలివరీ బాయ్. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆమెపై అత్యాచారం చేసాడు. ఆమె ఫోన్‌లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టి వెళ్లాడు డెలివరీ బాయ్. స్పృహలోకి వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు. ఇక ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.