తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఊహించని పరిణామం ఎదురైంది. కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనారోగ్యానికి గురయ్యారు. వర్షాకాలం రావడంతో ఆయన సీజనల్ వ్యాధుల బారిన పడినట్లు తెలుస్తోంది. స్వల్ప జ్వరం కూడా కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో వెంటనే హైదరాబాద్ సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. లండన్ నుంచి ఇవాలే హైదరాబాద్ వచ్చారు కల్వకుంట్ల తారక రామారావు. కెసిఆర్ అనారోగ్యం బారిన పడటంతో ఆయన వెంట కేటీఆర్ కూడా వెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కెసిఆర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.