కరోనా నుంచి మరో కొత్త వేరియంట్… యూకే, యూఎస్ లో కేసుల పెరుగుదలకు అదే కారణమా..!

-

ఓమిక్రాన్ ప్రస్తుతం ఈ పేరు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ప్రపంచంలోని వందకు పైగా దేశాలకు అతి త్వరగా వ్యాపించింది. ఇప్పటికే కేసుల సంఖ్య దాదాపుగా 2 లక్షలకు చేరువగా ఉంది. యూకేలో కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. అక్కడ లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో రానున్న రోజుల్లో మరింగా కేసులు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. యూకేలో ఇప్పటికే ఓమిక్రాన్ బారిన పడి 29 మంది మరణించారు. మరో వైపు యూఎస్ఏలో కూడా కేసుల తీవ్రత ఎక్కువగానే ఉంది.

అయితే ఇప్పుడు మరో కరోనా వేరియంట్ వచ్చిందా… అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా యూకే, యూఎస్ఏలో కేసుల పెరుగుదలకు ’’డెల్మీక్రాన్‘‘ అనే సూపర్ స్ట్రెయిన్ కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓమిక్రాన్, డెల్టా వేరియంట్లతో స్పైక్ ప్రొటీన్లు కలిస్తే డెల్మీక్రాన్ ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే కనుక నిజం అయితే ప్రపంచాన్నికి మరింత ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇది కనుక సోకితే.. ఆగకుండా దగ్గు, తీవ్రంగా జ్వరం, వాసన కోల్పోయే లక్షణాలు ఉంటాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version