హైదారాబాద్‌లోని పుప్పాలగూడలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పుప్పాల్ గూడ Golden oriole అపార్ట్‌మెంట్ వాసులు తాజాగా స్పందించారు. తెల్లవారు జామున 3:30 నిమిషాలకు b బ్లాక్ 202 ఫ్లాట్‌లో ఫ్రిజ్‌లో కంప్రెషర్ సిలెండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. అది మా పక్క ఫ్లాట్. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అందరం ఉలిక్కిపడ్డాము.
చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించాయి. ఫ్లాట్‌లో పెద్ద శబ్దం రావడంతోనే అంతా అలర్ట్ అయ్యాము. కుటుంబం మొత్తం బయటకు పరుగులు తీశాము.అయితే, నిబంధనలకు లోబడే అపార్ట్ మెంట్ నిర్మాణం జరిగింది. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రమాదం జరగగానే ఫైర్ సిబ్బందికి కాల్ చేయగా వెంటనే వారు స్పందించారు. స్పాట్‌కి మూడు ఫైర్ ఇంజిన్‌లు వచ్చాయి. మా అపార్ట్‌మెంట్ లో అగ్ని ప్రమాదాలపై ఇటీవల అవగాహన కార్యక్రమాలు సైతం జరిగాయి.
అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఆస్తినష్టం భారీగా వాటిల్లిందని పేర్కొన్నారు.