డెంగ్యూతో ఒకే కుటుంబంలో నలుగురి బలి.. ఆ పిల్లలకు దిక్కెవరు?

-

ఒక్క దోమ కాటు ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. తల్లి, తండ్రి, తాత, అక్క అంతా దోమకాటుతో వచ్చిన డెంగ్యూకు బలి కాగా రోజుల పసిపాపకు ఏడేళ్ల అన్నయ్యే తోడయ్యాడు. ఇంతటి కష్టం ఎవరికీ రాకూడదనిపించే ఈ దారుణం తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది..

మంచిర్యాల శ్రీశ్రీనగర్ కు చెందిన గుడిమల్ల రాజగట్టు, సోని శ్రీవికాస్ లకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడు శ్రీవికాస్, కూతురు శ్రీవర్షిణి ఉన్నారు. సోని నిండు గర్భిణి. మరికొద్దిరోజుల్లో ఇంట్లోకి మరో చిన్నారి వస్తుందన్న ఆనంద సమయంలో వారిని దోమ రూపంలో దురదృష్టం వెంటాడింది. ఈనెల 16న రాజు డెంగీ జ్వరంతో మరణించాడు.

ఇంటి పెద్దను కోల్పోయిన ఘటన నుంచి తేరుకునేలోపే 27న కుమార్తె శ్రీవర్షిణి కన్నుమూసింది. ఈనెల 20న తాత లింగయ్య సైతం అనారోగ్యంతో మృతిచెందాడు. ఇలా 15 రోజుల్లోనే వరుస మరణాలతో ఆ కుటుంబం తల్లడిల్లింది. తల్లి సోని సికింద్రాబాద్ యశోదలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మంగళవారం మగశిశువుకు జన్మనిచ్చింది.

ఆ ఒక్కరోజు పాపకు ఇప్పుడు తల్లితో సహా.. తనవాళ్లంటూ ఎవరూ మిగల్లేదు. తాత, చెల్లి, అమ్మ.. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎందుకు చనిపోయారో తెలియని ఏడేళ్ల బాలుడే ఇప్పుడు ఆ పాపకు మిగిలిన ఏకైక రక్తసంబంధం .. తెలంగాణలో డెంగ్యూ జ్వరాల తీవ్రతను తెలియజెప్పే ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం స్పందిస్తుందా.. ఆ చిన్నారులను ఆదుకుంటుందా.. చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version