ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహాన్ని చూసొద్దామా?

-

గుజరాత్ అంటే ద్వారకా టెంపుల్, గిర్ నేషనల్ పార్క్, రాన్ ఆఫ్ కచ్, జునాగఢ్… ఇవేనా.. ఇంకేం లేదా? ఎందుకు లేదు ఉంది… సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం. అది మామూలుది కాదు కదా. 182 మీటర్ల ఎత్తులో ఉన్న విగ్రహం అది. 597 అడుగులు ఉంటది. నర్మదా నదిపై నిర్మించిన ఈ విగ్రహానికి సర్దార్ వల్లభ్ భాయ్ ఐక్యతా విగ్రహం అని పేరు పెట్టారు.

మరి.. ఈ విగ్రహాన్ని చూడటానికి టూర్ ప్యాకేజీలు కూడా ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ కు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సర్దార్ పటేల్ విగ్రహం. దేశంలోని వివిధ నగరాల నుంచి అహ్మదాబాద్ కు బస్సు, ట్రెయిన్, విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అహ్మదాబాద్ నుంచి విగ్రహం వద్దకు బస్సులు, ట్యాక్సీ సర్వీసులు ఉంటాయి. లేదంటే వడొదర నుంచి కూడా విగ్రహం వద్దకు చేరుకోవచ్చు. వడోదర నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విగ్రహం.

నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ ఎలాగూ ప్రకృతికి నిలయం. దాంతో పాటు ఇప్పుడు సర్దార్ పటేల్ విగ్రహం కూడా వచ్చి చేరడంతో గుజరాత్ కు వెళ్లే టూరిస్టులు పటేల్ విగ్రహాన్ని కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పటేల్ విగ్రహం సందర్శనకు ప్యాకేజీలను ప్రవేశపెట్టారు. టికెట్ కోసం www.narmadatentcity.info , www.statueofunity.in వెబ్ సైట్లను సందర్శించవచ్చు. లేదంటే టికెట్లు విగ్రహం దగ్గర ఉన్న శ్రేష్ట భారత్ భవన్ లోనూ దొరుకుతాయి. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు విగ్రహ సందర్శన ఉంటుంది.

విగ్రహంలోని అనుమతి కావాలంటే 350 రూపాయల టికెట్ ఉంటుంది. 150 రూపాయల టికెట్ అయితే విగ్రహంలోనికి అనుమతించరు. దాంతో పాటు సర్దార్ పటేల్ మెమోరియల్, మ్యూజియం, సర్దార్ సరోవర్ డ్యామ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఆడియో వీడియో గ్యాలరీని వీక్షించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version