తీన్మార్ మల్లన్నకు కోర్టులో చుక్కెదురు

-

క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ యాజమాని తీన్మార్ మల్లన్నకు రంగారెడ్డి కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. గత మంగళవారం రాత్రి మేడిపల్లి పోలీసులు, ఎస్వోటీ పోలీసులు కలిసి పీర్జాదిగూడ – వరంగల్ హైవేపై వాహనాల తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో సివిల్ డ్రెస్ లో ఉన్న కొంతమంది ఎస్ఓటి పోలీసులు క్యూ న్యూస్ ఆఫీస్ కి కొద్ది దూరంలో కటాఫ్ డ్యూటీ చేస్తున్నారు.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

అయితే గుర్తుతెలియని వ్యక్తులు తమ కార్యాలయం ముందు రెక్కీ నిర్వహిస్తున్నట్లు అనుమానించిన కొంతమంది సిబ్బంది.. పోలీసులను బెదిరించి గదిలో బంధించారు. సమాచారం తెలిసి అక్కడే విధుల్లో ఉన్న మరో పోలీస్ బృందం వారి కార్యాలయానికి వెళ్లి బందీలుగా ఉన్న సిబ్బందిని విడిపించుకోవడం తెలిసిందే. అయితే పోలీసులు అని తెలిసి కూడా ప్రతినిధులు దాడి చేశారని వారిని అదుపులోకి తీసుకున్నారు. తీన్మార్ మల్లన్న తో సహా ఈ కేసులో 8 మందిని నిందితులుగా ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో వారంతా చర్లపల్లి జైల్లో ఉన్నారు. అయితే ఈ కేసులో బెయిల్ కోరిన మల్లన్న కి చుక్కెదురైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version