చినబాబు ‘పాలిట్రిక్స్’: సైకిల్ సీనియర్లు సైడ్?

-

ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో చినబాబు పెత్తనం ఎక్కువైందనే చెప్పాలి…ఎంతైనా భవిష్యత్ లో పార్టీని నడిపించాల్సిన నాయకుడు నారా లోకేష్ అనే సంగతి అందరికి అర్ధమవుతుంది..చంద్రబాబు పార్టీ పగ్గాలు..చినబాబుకే ఇస్తారని క్లియర్ కట్ గా తెలుస్తోంది. అందుకే ఇప్పటి నుంచే చినబాబు పార్టీపై గ్రిప్ సాధించే దిశగా పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

అలాగే పార్టీలో అనేక మార్పులు కూడా కనిపిస్తున్నాయి..ఈ మార్పులు వెనుక చినబాబు ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే నెక్స్ట్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అటు చంద్రబాబు, ఇటు చినబాబు కష్టపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చినబాబు ఊహించని విధంగా వ్యూహాలు పన్నుతూ ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు..మరి ఆయన వ్యూహాలు సక్సెస్ అవుతాయో లేదో తెలియదు గాని..ఇప్పుడు మాత్రం చినబాబు వ్యూహాలు పార్టీపై బాగా ప్రభావం చూపేలా ఉన్నాయి.

ఇటీవలే నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు కేటాయించే విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..వరుసగా మూడు సార్లు ఓడిపోయిన వారికి మళ్ళీ సీటు కేటాయించే విషయంపై ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే పార్టీ పదవులని కూడా మార్చాలని…ఎక్కువ కాలం ఒకే పదవిలో ఉండటం కరెక్ట్ కాదని చెప్పారు. ఇక చినబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ సీనియర్ నేతలని టెన్షన్ పెడుతున్నాయి. ఎందుకంటే కొందరు సీనియర్లు వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. ఉదాహరణకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 2004 నుంచి ఓడిపోతూ వస్తున్నారు. సర్వేపల్లిలో 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

ఇలా సోమిరెడ్డి నాలుగు సార్లు ఓడిపోయారు…మరి చినబాబు చెప్పిన ప్రకారం…నెక్స్ట్ సోమిరెడ్డికి సీటు దక్కదనే చెప్పాలి. అలాగే పదవుల్లో కూడా మార్పు చేయాలని అంటున్నారు. ఇది కూడా సీనియర్లకు ఇబ్బంది కలిగించే విషయమే..ఎందుకంటే ఏళ్ల తరబడి కొందరు సీనియర్లు పదవుల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ పదవుల్లో మార్పు చేయాలని అంటున్నారు. అంటే ఎంతమంది సీనియర్లు సైడ్ అవుతారో చూడాలి. మొత్తానికి చినబాబు రాజకీయం…సీనియర్లకు చెమటలు పట్టిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version