ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు మేలు చేస్తాయి ఏంటి అనేది ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. తిరుపతి ఉప ఎన్నికలను అధికార పార్టీ సీరియస్ గా తీసుకుంది. సంక్షేమ కార్యక్రమాలను ప్రధాన ఎజెండాగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు వైసిపికి ఎంతవరకు మేలు చేకూరుస్తాయి ఏంటి అనే దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు.
చాలామంది కీలక నేతలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వాలంటీర్ల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే సంక్షేమ కార్యక్రమాలు వైసీపీ గెలిపించే అవకాశం లేదనే భావన కూడా ఉంది. ఎందుకు ఏంటనేది ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా ఇప్పుడు కాస్త తిరుపతి ఎన్నికల మీద గట్టిగా దృష్టి పెట్టింది. కాబట్టి ఎన్నికల సమయానికి ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలు వైసీపీ ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు.
కాబట్టి సంక్షేమ కార్యక్రమాల కంటే కూడా చివరి నిమిషంలో ప్రజలకు జరిగే కార్యక్రమాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ నేతలు దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని లేకపోతే సంక్షేమ కార్యక్రమాల ద్వారా వెళితే పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు అని ఆ చివరి నిమిషంలో వచ్చే ఆదాయం గురించే ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.