సుగాలి ప్రీతి కేసుపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి కేసుపై ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో గళమెత్తాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందరూ తప్పించుకుని వెళ్లిపోతే ఎలా..? నేరస్తుడు ఏదో ఒక కులానికి చెందాల్సిందే అంటూ ఫైర్ అయ్యారు. కానీ క్రైమ్ కి కులం ఉండదన్నారు. నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ కేసుపై హోం మంత్రి, డీజీపీ, సీఐడీ చీఫ్ తో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరానని చెప్పారు.

విచారణలో అనుమానితుల డీఎన్ఏ సరిపోలడం లేదని చెప్పారు. సాక్ష్యాలను తారు మారు చేశారని వివరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయని.. సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలన్నారు పవన్ కళ్యాణ్. ఇది నా ఒకరి కేసు కాదు.. లా అండ్ ఆర్డర్ సీఎం చేతుల్లో ఉంటుంది.. ఇంతకు మించి మాట్లాడలేనని చెప్పారు. ఎవరి వల్ల సుగాలి ప్రీతీ కేసు బయటికి వచ్చిందన్నారు. నాకు ఉన్నా చిత్తశుద్దిని ప్రశ్నించకండి అని కోరారు డీసీఎం పవన్ కళ్యాణ్.