ధర్మపురి వద్ద ప్రమాదకరంగా గోదావరి వరద.. కీలక ఆదేశాలు జారీ

-

ధర్మపురి వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన ఉన్న కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో, ధర్మపురి క్షేత్రం వద్ద గోదావరికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. నది ఒడ్డున ఉన్న సంతోషి మాత ఆలయంలోకి వరద నీరు చేరింది.

Godavari continues to rise in flood waters at Dharmapuri
Godavari continues to rise in flood waters at Dharmapuri

భక్తులు స్నానానికి వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసారు అధికారులు. అటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news