నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఉండనుంది. నేటి నుంచి జపాన్, చైనాలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు మోదీ. జపాన్ లో రెండు రోజులు పర్యటించనున్న ప్రధాని మోదీ.. ఈ నెల 31న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని మోదీ భేటీ అవుతారు. ఈ రోజు ఉదయమే నాలుగు రోజుల పర్యటనకు బయలుదేరారు ప్రధాని మోడీ.

భారత్ పై అమెరికా సుంకాల నేపథ్యంలో మోదీ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తరుణంలో కాసేపటి క్రితమే టోక్యో విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం లభించింది. భారత ప్రధాని మోడీకి గాయత్రి మంత్రంతో స్వాగతం పలికారు జపాన్ వాసులు. మోదీ పర్యటన సందర్భంగా ప్రవాహ భారతీయుల సాంస్కృతిక ప్రదర్శనలు కూడా చేసారు.