ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌ పై స్పందించిన డిప్యూటీ సీఎం..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఈ మహమ్మారిని కొంత మేరకు అయినా అరికట్టడానికి లాక్ డౌన్ విధించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. దేశం ఆర్థికంగా చాల నష్టపోయింది. ఇక ఆన్ లాక్ సడలింపులతో ఇప్పుడిప్పుడే దేశంలో వ్యాపార సంస్థలు తెర్చుకుంటున్నాయి. అయితే మళ్ళి కరోనా వైరస్ సెకండ్ వె స్టార్ట్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండం చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా మూడో దశ కొనసాగుతుంది. ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మళ్లీ లాక్ ‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలో వాటిపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ శిశోడియా స్పందించారు. ఢిల్లీలో లాక్‌ డౌన్‌ గానీ మినీ లాక్‌ డౌన్ ‌గానీ విధించే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

అయితే పండుగ నేపథ్యంలో పలు మార్కెట్లు రద్దీగా మారాయని ఆయన అన్నారు. దీంతోనే కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని వెల్లడించారు. ఇక పండుగ సీజన్ ముగిశాక కరోనా కేసులు తగ్గుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. కేసుల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కాగా మంగళవారం రోజు మాట్లాడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రద్దీగా ఉండే పలు మార్కెట్లను మూసివేయాలని అనుకుంటున్నామని తెలిపారు. దీనిపై కేంద్రానికి ఓ ప్రపోజల్‌ పంపామని ఆయన వెల్లడించారు. ప్రజలు ఈ ,మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరించి. సామాజిక దూరం పాటించాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ శిశోడియా కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version