డేరా బాబాకు ఇక జీవితాంతం జైలే…

-

‘పూరా సచ్‌’ వార్తాపత్రికకు చెందిన జర్నలిస్ట్ హత్య కేసులో ప్రధాన దోషిగా తేలిన డేరా బాబా(గుర్మీత్ రామ్ రాహీమ్ సింగ్) కు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అత్యాచారం కేసులో గుర్మీత్‌ ఇప్పటికే 20ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. అయితే జర్నలిస్ట్ హత్య కేసులో ఆయనతో పాటు దోషులుగా తేలిన మరో ముగ్గురు కుల్దీప్‌ సింగ్‌, నిర్మల్‌ సింగ్‌, కృషన్‌ లాల్‌కు సైతం న్యాయస్థానం జీవిత ఖైదుని విధిస్తూ.. తీర్పును వెలువరించింది. 2002లో సిర్సాకు చెందిన జర్నలిస్ట్‌ ఛత్రపతిని హత్య చేసినందుకు గానూ గుర్మీత్‌పై కేసు నమోదు అయ్యింది.

దీంతో నాటి నుంచి కేసుని విచారించిన కోర్టు గత వారం డేరా బాబాను దోషిగా నిర్దారించింది. శిక్ష కాలాన్ని నేడు ప్రకటించింది. దీంతో కోర్టు సమీప ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144సెక్షన్‌ను విధించారు. డేరా బాబాకు శిక్ష పడటంతో సామాజిక మాధ్యామాల్లో ఇక డేరా బాబా ..జీవితాంతం జైలుకే అంటూ పలువురు కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version