నందమూరి బాలకృష్ణ కెరియర్ లో అవసరం అనుకున్న టైంలో సరైన హిట్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్యకే కాదు బోయపాటి శ్రీనుకి స్టార్ క్రేజ్ తెచ్చేలా చేశాయి సింహా, లెజెండ్ సినిమాలు. బాలకృష్ణతో చేసిన సింహా అప్పటిదాకా బాలకృష్ణ ఫ్లాపుల ఒరవడికి తెర దించింది. అంతేకాదు ఆ సినిమా వసూళ్లు కూడా దుమ్మురేపింది. ఇక ఆ తర్వాత వచ్చిన లెజెండ్ సినిమా కూడా హిట్ అయ్యింది.
ఇదిలాఉంటే మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. హ్యాట్రిక్ మూవీ కాబట్టి సహజంగానే ఈ సినిమాపై అంచనాలున్నాయి. వినయ విధేయ రామ అంచనాలను అందుకోని బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమా కథ కూడా అటు ఇటుగా సింహా టైపులోనే ఉంటుందట. రాబోయే ఈ సినిమాలో కూడా బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది.
మరి చేసేది వేరే సినిమానా లేక సిం హాకు సీక్వలా అన్న టాక్ మొదలైంది. వినయ విధేయ రామ ఫ్లాప్ తో బోయపాటి సినిమా అన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమాతో తన మీద వచ్చిన ఈ అపవాదాలను చెరిపేస్తాడా లేక కొనసాగిస్తాడా అన్నది చూడాలి.