ఇంకా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అణిచివేసే కార్యక్రమాలు చేసిన, అరెస్ట్‌లు చేసిన భయపడే పరిస్తితి ప్రతిపక్షాల్లో కనిపించడం లేదు. గతంలో తమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారని చెప్పి..అధికారంలోకి వచ్చాక వైసీపీ ఏ స్థాయిలో టీడీపీకి చుక్కలు చూపించిందో చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరిగాయి..చాలామంది జైలుకు కూడా వెళ్లారు.
ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని సైతం వైసీపీ గట్టిగానే టార్గెట్ చేసింది..వైజాగ్ ఘటన తర్వాత నుంచి పవన్‌ని వదలడం లేదు. తాజాగా ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు అంటూ..అక్కడ కొందరు ఇళ్లని ప్రభుత్వం కూల్చివేసింది. అయితే గతంలో జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామ ప్రజలు స్థలం ఇచ్చారు. ఆ కక్షతోనే ఇప్పుడు రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్ళు కూల్చివేశారని చెప్పి పవన్..ఇప్పటం గ్రామంకు వచ్చి..బాధితులకు అండగా నిలిచి, వైసీపీపై విరుచుకుపడ్డారు. అలాగే మధ్యలో పోలీసులు పవన్‌ని ఆపిస్తే..ఆయన నడుచుకుంటూ ముందుకొచ్చారు.
ఈ క్రమంలో అందరూ అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉండాలని, రక్తం చిందించిన పర్లేదు అని చెప్పి..పోలీసుల ముందే జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. అంటే ఎంతమంది అయిన అరెస్ట్ చేసుకోండి అంటూ పవన్ తెగించి మాట్లాడేశారు. రోడ్లపై గుంతలు పూడ్చి విస్తరణ చేయాలంటూ ఫైర్ అయ్యారు.
ఇదే క్రమంలో ఎవరికి ఏం జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డిదే బాధ్యత అని పవన్ మాట్లాడారు. అంటే అంతా సజ్జల చేయిస్తున్నారని పవన్ ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా గాని ఇంకా అరెస్టులకు భయపడేది లేదన్నట్లు పవన్ తెగించేశారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తామో చూస్తామని అంటున్నారు. అటు టీడీపీ నేతలు కూడా అరెస్టులకు ఇంకా భయపడటం లేదు. మొదట్లో కేసుల గురించి భయపడి కాస్త వెనక్కి తగ్గారు. ఇప్పుడు జనసేన గాని, ఇటు టీడీపీ నేతలు గాని ఇంకా ఏదైనా పర్లేదు అన్నట్లు ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్షాలని దెబ్బకొట్టడానికి వైసీపీ ఎలాంటి ప్లాన్స్‌తో వస్తుందో చూడాలి.