తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో బీజేపీ పార్టీలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. శాసన సభ నుండి బీజేపీ పార్టీ వాక్ ఔట్ చేసినా ఇంకా సభలోనే బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కొనసాగారు. బీజేపీ వాకౌట్ చేసినా సభలోనే ఉండి ప్రసంగించారు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు.

తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది అవాస్తవమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం చేపడితే కమీషన్లు రావనే ఉద్దేశంతోనే మేడిగడ్డకు ప్రాజెక్టును తరలించారనేది తేటతెల్లమైందని సభలో కీలక వ్యాఖ్యలు చేసారు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు.
ఇక అటు కమిషన్ నివేదిక కాపీలను చించి చెత్తబుట్టలో వేశారు. అమరవీరుల స్థూపం వద్ద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును చించి చెత్త బుట్టలో పారేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి నిన్న గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.