మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్‌.. ఏం జ‌రిగిందంటే..?

-

విజయవాడలోని గొల్లపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజధాని మార్పు చేయొద్దంటూ రైతులు ధర్నాకు దిగారు. గొల్లపూడి నుంచి విజయవాడ దుర్గగుడి వరకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చెపట్టారు. ఈ ర్యాలీని అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారు. అయితే రైతులకు మద్దతుగా మాజీ మంత్రి దేవినేని ఉమ రోడ్డుపై బైఠాయించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు.

రైతులు, మహిళలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు దేవినేని ఉమను అరెస్టు చేశారు. కాగా.. ఏపీ కెబినెట్ సమావేశం ప్రారంభమైంది. నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి జీఎన్‌ రావు కమిటీ నివేదిక, స్థానిక ఎన్నికలపై ఈ సమావేశంలో నిశితంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో రాజధానిపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version