ఎంత అధికారయావ ఉంటేమాత్రం.. మరీ ఇలానా ఉమా?

-

మనం ఐదేళ్ల పాటు అందించిన “బాబుల మార్కు పాలన” ఫలితమే ఈ 23 సీట్లకు పడిపోవడం అన్న విషయం మరిచారో లేక జనాలపై కక్ష కట్టారో కానీ… ప్రస్తుతం అధికారం లేదు అనే ఫ్రస్ట్రేషన్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న టీడీపీ నేతలు చేస్తున్న చేష్టలు, చెబుతున్న మాటలు… వారి అధికార కాంక్షని చెప్పకనే చెబుతున్నాయి. ఏమైనా అంటే… రోజు రోజుకీ కరోనా కేసులు ఏపీలో పెరిగిపోతున్నాయి, అది అధికారపార్టీ చేతకాని తనం అంటారు. దేవుడు నోరిచ్చాడు కదా అని!! నిజం చెప్పాలంటే… ఏపీలో రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల విషయంలో…. “కేసులు పెరుగుతున్నాయి అనడం కంటే… కేసులు బయటపడుతున్నాయి” అనడం సంస్కారం! ఎన్ని వేల టెస్టులు చేస్తుంటే… అన్నేసి కేసులు బయటపడుతున్నాయో ఆలోచించుకోవాలి కదా!

ఈ విషయాలు మరిచిన ఏపీ టీడీపీ నేతలు ఏ రేంజ్ లో అధికారపార్టీపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! మాట్లాడే పాయింట్స్ కూడా ఏమి లేక… ఇప్పుడు అంతా ఒకటే పాయింట్… రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి… అసలు మనం ఎక్కడికి పోతున్నాం! అని!! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా ఫ్లోలో వచ్చిన కోరికో లేక మనసులో ఉన్న భ్రమో తెలియదు కానీ…. పరిపాలించడం చేతకాకపోతే మాకు చెప్పండి… మేము పరిపాలిస్తాం అంటున్నారు దేవినేని ఉమామహేశ్వర రావు! ఇంతకు మించిన నిస్సిగ్గు మాట మరొకటి ఉంటుందా అని కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో… ఇది ప్రజాస్వామ్యం అన్న విషయం దేవినేని ఉమ మరిచారనుకోవాలా లేక ఫ్రస్ట్రేషన్ లో ఇలా అనేశారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎంత అధికార యావ ఉంటే మాత్రం మరీ ఇంత నిస్సుగ్గుగా కోరికలు బయటపెట్టేస్తారా? ఇంకా నయం… పోర్ట్ ఫోలియోలు కూడా డిసైడ్ చేసేసుకుని, నేం ప్లేట్స్ కూడా సిద్దం చేసేసుకున్నారు కాదు సదరు టీడీపీ నేత! ఇది ప్రజాస్వామ్యం… ఇక్కడ ప్రజలు అధికారం ఇచ్చినవారే పరిపాలిస్తారు! కొంతమంది మాత్రం అడ్డగోలుగా, వెన్నుపోట్లు పొడిచి అధికారం సంపాదించుకుంటారు. కానీ దేవినేని ఉమ మాత్రం…. ఈ కరోనా పేరు చెప్పి ఏదో ఒక కుర్చీ ఎక్కేద్దాం అన్నట్లుగా భావిస్తున్నట్లున్నారు! అధికారాలు అలా రావు ఉమా!!

Read more RELATED
Recommended to you

Exit mobile version