మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై భక్తుల ఆగ్రహం

-

పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లపై భక్తులు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? అంటూ నిల‌దీశారు. పోలీసులు ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి వచ్చిన వారిని కొట్టి, వాహనాల అద్దాలు పగలగొడుతున్నారంటూ భక్తులు ఆరోపణలు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లపై భక్తులు ఆగ్రహం చేస్తారు.

Devotees are angry with Minister Ponnam Prabhakar, Mayor Gadwal Vijayalakshmi, and MLC Balmuri Venkat.
Devotees are angry with Minister Ponnam Prabhakar, Mayor Gadwal Vijayalakshmi, and MLC Balmuri Venkat.

ట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాట్లు సరిగ్గా చేయలేదంటూ అసహనం వ్య‌క్తం చేశారు. అటు ఇప్పటి వరకూ దాదాపు లక్షన్నరకు పైగా గణనాథులను నిమజ్జనం చేశారన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ట్యాంక్ బండ్ వద్ద దాదాపు లక్ష విగ్రహాలను నిమజ్జనం చేశారు… నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్, చెరువుల్లో 56 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. హుస్సేన్ సాగర్ వద్ద 24/7 శానిటేషన్ పనులు చేపట్టామ‌ని… రేపటి నిమజ్జన వేడుకలు ప్రశాంతమైన వాతావారణంలో జరిగేలా ఏర్పాట్లు చేశామ‌ని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news