వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి నదిలో కొట్టుకుపోయిన వ్యక్తికి సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ గా మారింది. హరిద్వార్‌లో వినాయకుడిని నిమజ్జనం చేసే క్రమంలో గంగా నదిలో అదుపుతప్పి నిఖిల్ గుప్తా (38) పడిపోయాడు. అక్కడ ఉన్నవారు సాయం కోసం అరుస్తుండగానే నీటిలో కొట్టుకుపోయాడు ఆ వ్యక్తి.

ఇక ఈ సమాచారం అందుకొని SDRF సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ తరుణంలోనే ఈ సంఘటన వినాయక నిమజ్జన వేడుకలో ప్రజలలో కలకలం రేపింది. అధికారులు ప్రజలను నదీప్రవాహానికి దగ్గరగా వెళ్లకుండా సురక్షితంగా ఉండమని హెచ్చరిస్తున్నారు.
షాకింగ్ వీడియో
వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి
హరిద్వార్‌లో వినాయకుడిని నిమజ్జనం చేసే క్రమంలో గంగా నదిలో అదుపుతప్పి పడిపోయిన నిఖిల్ గుప్తా(38)
అక్కడ ఉన్నవారు సాయం కోసం అరుస్తుండగానే నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి
సమాచారం అందుకొని SDRF సిబ్బందితో… pic.twitter.com/8v7PLhYJIT
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2025