ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతరకి ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.భారీగా వాహనాలు తరలి వస్తున్నాయి. ఇవాళ మూడు లక్షల మందికి పైగా భక్తులు సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారానికి వచ్చే మూడు మార్గాల్లోనూ ప్రత్యేక భద్రత కల్పించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది.
ఇదిలా ఉంటే…..ఈనెల 21 నుంచి జరిగే మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఫిబ్రవరి 18 నుంచి 26 వరకు వివిధ ప్రాంతాల నుంచి 6,000 బస్సులు నడపనున్నట్లు తెలిపారు.సుమారు 4,800 సీసీ కెమెరాలు, 55 ఎకరాల్లో తాత్కాలిక బస్టాండ్, 5,600 మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక మీడియా సెంటర్, కమాండ్ కంట్రోల్ రూమ్, విద్యుత్ కోసం ప్రత్యేక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.