రాజస్థాన్‌లోని జలవార్ జిల్లాలో ఓ ఆలయ నిర్మాణం కోసం తీసిన పునాది గోతిలో ఏకంగా 11 వేల లీటర్ల పాలు, పెరుగు, వెన్న పోసి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జలవార్ జిల్లాలోని రత్లాయ్‌లో దేవ్‌నారాయణ్ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామ పెద్దలు, పూజారులు ఆలయ శంకుస్థాన కోసం 11 వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యిని సేకరించి ఆలయం కోసం తీసిన గోతిలో పోశారు. శంకుస్థాపన కోసం గుజ్జర్, పలు కులాలు 11 వేల లీటర్ల పాలు,పెరుగు, నెయ్యి అందజేశారు. వాటి విలువ దాదాపుగా రూ.1.5 లక్ష వరకు ఉంటుందని ఆలయ నిర్మాణ కమిటీ అధికార ప్రతినిధి రామ్‌లాల్ పేర్కొన్నారు. శంకుస్థాపనకు ఓ రోజుల ముందు మేము వారిని అడిగామని, ఇలా చేయటం ఆచారం కాదు, అయినా.. వారు భక్తితో తెచ్చిచ్చారు. గతంలోనూ ఇచ్చారన్నారు. భగవంతుకు మనకిచ్చే ధనం, ఆరోగ్యం కన్నా ఇవన్నీ చాలా తక్కువ. ఇలా ఆహార పదర్థాలు గోతిలో వేయడం వృథా కాదు.. దేవ్‌నారాయణ్ మా పాడిని రక్షిస్తాడని ఆయన పేర్కొన్నారు.