మషిని బాగా ఇబ్బంది పెట్టె సమస్యలలో ఒకటి దగ్గు. ఇక పొడి దగ్గు వచ్చినప్పుడు, వెంటనే ఉపశమనం కోసం మనం తరచుగా దగ్గు సిరప్‌లను ఆశ్రయిస్తాం. వాటిలో ఒకటి డెక్స్ట్రోమెథోర్ఫాన్ (Dextromethorphan). ఇది దగ్గును అదుపు చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ఇది నిజంగా సురక్షితమేనా? దీన్ని సరైన మోతాదులో జాగ్రత్తగా ఉపయోగించడం ఎలా? ఈ ప్రసిద్ధ సిరప్‌ను వాడే ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ప్రయోజనాలు ప్రమాదాలు మరియు ముఖ్యమైన మార్గదర్శకాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డెక్స్ట్రోమెథోర్ఫాన్ ఎలా పనిచేస్తుంది: డెక్స్ట్రోమెథోర్ఫాన్, దగ్గును అణచివేసే ఔషధాలకు చెందినది. ఇది ప్రధానంగా పొడి దగ్గు లేదా గొంతు కిచ్కిచ్గా ఉండి వచ్చే దగ్గుకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది మన మెదడులోని దగ్గు కేంద్రం పై పనిచేసి, దగ్గు వచ్చే సంకేతాలను తగ్గిస్తుంది. దీనివల్ల దగ్గు ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది ముఖ్యంగా రాత్రిపూట దగ్గు వల్ల నిద్ర పట్టనివారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది కఫంతో కూడిన దగ్గు కోసం కాదు ఎందుకంటే కఫం బయటకు రావడానికి దగ్గు అవసరం.ఈ సిరప్లు సాధారణంగా ఇతర పదార్థాలు (పారాసెటమాల్ లేదా యాంటీహిస్టామైన్స్ వంటివి) కలిపి ఉంటాయి కాబట్టి ఏ ఇతర మందులు వాడుతున్నారో గమనించుకోవాలి.

భద్రత మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: డెక్స్ట్రోమెథోర్ఫాన్ సాధారణంగా సిఫార్సు చేయబడిన మోతాదులో సురక్షితంగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ దీనిని అధిక మోతాదులో తీసుకుంటే మైకం, తలతిరగడం, వికారం మరియు అరుదుగా భ్రాంతులు వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ ఔషధాన్ని నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు తప్పనిసరిగా ఇవ్వకూడదు.
డెక్స్ట్రోమెథోర్ఫాన్‌ను కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్స్ లేదా ఇతర దగ్గు మందులతో కలిపి తీసుకుంటే తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. అందుకే, ఏదైనా కొత్త మందు ప్రారంభించే ముందు మీ వైద్యుడికి మీరు వాడుతున్న అన్ని ఔషధాల గురించి చెప్పడం చాలా ముఖ్యం. మోతాదు సూచనలను అతిక్రమించకుండా, సూచించిన విధంగా మాత్రమే వాడాలి.
డెక్స్ట్రోమెథోర్ఫాన్ పొడి దగ్గు నుండి త్వరిత ఉపశమనం కోసం ఒక ప్రభావవంతమైన ఎంపిక. సరైన మోతాదు మరియు అవగాహనతో ఉపయోగించినప్పుడు ఇది సురక్షితమే. జాగ్రత్తతో కూడిన వాడకం అనేది దీని భద్రతకు కీలకం.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, దగ్గు మూడు రోజులకు మించి కొనసాగినా లేదా జ్వరం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలతో కూడి ఉన్నా, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.