దసరా ఉత్సవాల సంధర్బంగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. గౌతమ్ సవాంగ్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం చదివించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ….దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి వాటిని భక్తులు పెద్ద మనసుతో క్షమించాలని అన్నారు. దసరా శరన్నవరాత్రి లో పోలీసుల పాత్ర చాలా కీలకమైందంటూ డీజీపీ వ్యాఖ్యానించారు. విధి నిర్వహణ నిర్వహిస్తున్న పోలీసులు అందరికీ నా కృతజ్ఞతలు అంటూ వ్యాఖ్యానించారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సీపీ ముందుండి జరిపించడం చాలా సంతోషకరం గా ఉందంటూ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించారు.