విడాకుల తర్వాత నాగచైతన్య మొదటి పోస్ట్.. ఏమన్నాడంటే..

-

నాగచైతన్య, సమంతతో విడాకుల వ్యవహారం తరవాత సోషల్ మీడియా సైలెంట్ అయిపోయాడు. అక్టోబర్ 2 న తాను, సమంత విడిపోతున్నట్లు అభిమానులను, శ్రేయోభిమానులకు ఉద్దేశిస్తూ పోస్ట్ చేశాడు. ఎవరిదారి వారు చూసుకున్నట్లుగా తెలిపాడు. ఇటువంటి సమయంలో తమకు అండగా ఉండాలంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి దాదాపుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. విడాకుల విషయం బయటకి వచ్చిన తర్వాత నుంచి కారణాలను వెతుకుతూ సోషల్ మీడియాలో అనేక రూమర్లు షికారు చేశాయి. వీటిపై క్లారీటీ ఇస్తూ భావోద్వేగంతో సమంత ఇన్ స్టాలో పలు పోస్టులు పెట్టింది. అయితే నాగ చైతన్య మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. దాదాపుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నాగచైతన్య లేటెస్ట్ గా ట్విట్టర్ లో ఓపోస్ట్ పెట్టాడు. తాజాగా రాజ్ తరుణ్ నటిస్తున్న’అనుభవించు రాజా‘ మూవీపై పోస్ట్ పెట్టాడు. టైటిల్ ట్రాక్ విడుదల కావడంతో చిత్ర యూనిట్ కు గుడ్ లక్ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version