తెలంగాణలో నేరాలపై డీజీపీ మహేందర్ రెడ్డి వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… గతంతో పోల్చుకుటే… ఈ ఏడాది హత్యలు 4శాతం, దొంగతనాలు 8శాతం, మహిళలపై నేరాలు 7శాతం, సైబర్ నేరాలు 3శాతం తగ్గాయన్నారు. ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 3శాతం తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న 385 మందిపై పీడీ చట్టం ప్రయోగించామన్నారు. ఏడాది శాంతిభద్రతల పరంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తలేదని మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం పోలీసు శాఖను అందిస్తున్న సహకారంతో సాంకేతికతను ఉపయోగించుకొని పోలీసింగ్‌ను సులభతరం చేస్తున్నామన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్, షీటీమ్స్ ఏర్పాటుతో మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. పోలీస్ శాఖ పనితీరు మెచ్చుకొని పలు సంస్థలు పురస్కారాలు అందిస్తున్నాయని డీజీపీ తెలిపారు. గణేష్ నిమజ్జనం, ఇటీవల జరిగిన ఎన్నికలు వంటి సున్నిత సమయాల్లోనూ పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేసిందని వివరించారు.