Dhanush: రెండు దశాబ్దాల ప్రస్థానం..‘సార్’గా సరికొత్త లుక్‌లో ధనుష్

-

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు పూర్తయింది. బాయ్ నెక్స్ట్ డోర్ లాగా అనిపించే ఈ యంగ్ హీరో సక్సెస్ ఫుల్ గా హీరోగా ముందుకు సాగుతున్నాడు. తమిళ్ భాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఆయన నటించిన సినిమాలు విడుదలై సక్సెస్ అవుతున్నాయి.

హాలీవుడ్ లోనూ సత్తా చాటబోతున్నాడు ధనుష్. ‘ద గ్రే మ్యాన్’ అనే ఇంగ్లిష్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు ధనుష్. బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు ధనుష్. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంల్ ‘సార్’ అనే ఫిల్మ్ చేస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. పిక్చర్ ఫస్ట్ లుక్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ధనుష్ హీరోగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ తో విష్ చేశారు. త్వరలో ‘సార్’ ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ధనుష్ ఓ చిత్రం చేస్తు్న్నారు. ఈ చిత్రం కూడా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇక ధనుష్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను మ్యారేజ్ చేసుకున్నాడు. ఇటీవల వీరు విడాకులు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version