నేటి నుంచి అందుబాటులోకి ధరణి పోర్టల్..మేడ్చల్ ప్రారంభించనున్నాన్న సీఎం కేసీఆర్.

-

తెలంగాణ ప్రజలకు నేటి నుంచి ధరణి సేవలు అందుబాటులోకి రానున్నాయి..మేడ్చల్ జిల్లాలో పోర్టల్‌ ను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్..మధ్యాహ్నం 12.30గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి సేవలు ప్రారంభించనున్నారు.ఆ తరువాత నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి..రాష్ట్ర వ్యాప్తంగా 570మండలాల్లో దీనికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ధరణి పోర్టల్ పై రెవెన్యూ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు సీఎస్ సోమేష్ కుమార్..ధరణి పోర్టల్ ప్రారంభం తర్వాత ఈ రోజు నుంచి రాష్ట్రావ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి సాగు భూముల మాత్రమే రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్న కేసీఆర్‌..సమీకృత భూ రికార్డ్‌ల యాజమాన్య విధానం ధరణిని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. భూ రికార్డ్‌లన్నింటిని ఆన్లైన్లోకి మార్చుతోంది. భూ పరిపాలన, రిజిస్ట్రేషన్ సేవలు రెండింటిని అనుసంధానం చేసే అధునాతన భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థని రూపొందిస్తోంది..ధరణి టెక్నికల్ సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో ఏర్పాటుచేసే కంట్రోల్ రూంతో పాటు జిల్లాస్థాయి టెక్నికల్ సపోర్ట్ టీంలు పనిచేయనున్నాయి. ధరణి అమలుకు అవసరమైన సౌకర్యాలను తహసీల్దార్ కార్యాలయాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు ఇప్పటికే సీఎస్‌ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version