తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రుణమాఫీ అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రైతులకు కాలేదని గులాబీ పార్టీ నిత్యo ఆరోపణలు చేస్తోంది. అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అందరికీ.. రుణమాఫీ జరిగిందని చెబుతోంది. అయితే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని గులాబీ పార్టీ… కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఇవాళ… చేవెళ్ల నియోజకవర్గంలో.. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ధర్నా నిర్వహించనున్నారు.
ఇందులో గులాబీ పార్టీ నేతలతో పాటు రైతులు కూడా పాల్గొంటారు. అటు ఆలేరు నియోజకవర్గంలో… మాజీ మంత్రి హరీష్ రావు ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ నేతల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. అటు కేసీఆర్ను తిట్టినందుకుగాను రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేయనున్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం కూడా ఉంటుంది.