‘ధోనీ ఎప్పటికీ ధోనీనే’.. హర్డిక్ పాండ్య పై షమి కీలక వ్యాఖ్యలు

-

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా నిన్న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత గెలిచేలా కనిపించిన ముంబయి.. అనూహ్యంగా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య తీసుకున్న పలు నిర్ణయాలపై ఫ్యాన్స్ తోపాటు, కొంతమంది ప్లేయర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్‌ షమి కూడా హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

ధోనీ ఎప్పటికీ ధోనీనే. అతనికి ఎవరూ సరితూగరు . ప్రతి ఒక్కరికి భిన్నమైన మనస్తత్వం ఉంటుంది అని అన్నారు. ధోనీ అయినా విరాట్ కోహ్లీ అయినా అందరి ఆలోచనా ధోరణి వేరు అని అన్నారు. మీ నైపుణ్యాన్ని బట్టి మీరు ఆటలో కొనసాగాలి. గత రెండు సీజన్లలో గుజరాత్ తరఫున హార్దిక్‌ పాండ్య మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడు . కెరీర్‌లో చాలాసార్లు ఐదో స్థానంలో కూడా ఆడిన హర్డిక్ పాండ్య మరి ఇప్పుడు ముంబయి తరఫున ఏడో స్థానంలో ఎందుకు వచ్చాడు? ఇలా చేయడం వల్ల హార్దిక్ దాదాపు టెయిలెండర్‌లాగా కనిపిస్తున్నాడు అని అన్నారు. ఏడో స్థానంలో వస్తే మీపై మీరే ఒత్తిడి పెంచుకున్నట్లవుతుంది. ఒకవేళ పాండ్య ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్‌ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు” అని షమి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version