కంగనా రనౌత్ పై హిమాచల్ మంత్రి కీలక వ్యాఖ్యలు

-

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితా హిమాచల్ ప్రదేశ్లోని మండి సెగ్మెంట్ బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ కు బీజేపీ టికెట్ కేటాయింది. కంగనా రనౌత్కు బీజేపీ టికెట్ ప్రకటించటంపై హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాధిత్య సింగ్ స్పందించారు. కంగనా రనౌత్ మూడింట ఒక వంతు సమయం కూడా తాను పోటీచేసే నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని అన్నారు.

అభ్యర్థుల ఎంపిక బీజేపీ పార్టీ అంతర్గత విషయం. నేను వారు ఎంపిక విధానంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఎంపిక విధానం ఆ పార్టీ స్వేచ్చ. మేము మా బలంలో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతాం. మేము కంగనా రౌనతన్ను గౌరవిస్తాం. సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకొని.. హిమాచల్ ప్రదేశ్ కు పేరు తెచ్చారు. కానీ ఇది రాజకీయ రంగం. అతిపెద్ద సందేహం ఏమిటంటే.. ఒక నటిగా ఆమెకు సినిమాల్లో నటించటం, నిర్మించటమే తొలి ప్రాధాన్యం. ఆమె కనీసం మూడింట ఒకవంతు సమయమైనా హిమాచల్ ప్రదేశ్ కు కేటాయించగలరా?’ అని ప్రశ్నించారు.

‘స్టార్డమ్ రాజకీయాలు చేయటం అంత సులభం కాదు. బీజేపీ కంగనా స్టార్డమ్ మీద మత్రమే ఆధారపడుతోంది. కేవలం సారడమ్ ఆధారంగా ఆమె అభ్యర్థిగా బరిలో దింపటం సరికాదు. ఆమె ప్రాధాన్యం ఎప్పుడూ బాలివుడ్ సినిమా పరిశ్రమే. గెలిచినా లేదా ఓడినా రాజకీయాలు అమెకు తొలి ప్రాధాన్యం కాదు. అందుకే మండి నియోజకవర్గం ప్రజలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండే నేత కావాలా? లేదా స్టార్డమ్ ఉన్న వాళ్లకు ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలి’ అని మంత్రి విక్రమాధిత్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version